బీజేపీ నేత కంచి మహేందర్ ఆధ్వర్యంలో ఎంఎంటీఎస్ రైల్వే పనులు
కూకట్పల్లి జనవరి 11 (త్రినేత్రం న్యూస్) : కూకట్ పల్లి నియోజకవర్గం మూసా పేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ప్రాంతంలో ఎంఎంటీఎస్ గేటు మూసివేతతో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలకు పరిష్కారం దిశగా ఆదివారం కీలక ముందడుగు పడింది. ప్రతి రోజూ ఉద్యోగాలకు, ఉపాధి కోసం ప్రయాణించే కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, టికెట్ సదుపాయాల లేమితో రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సిన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గతంలో ఈ మార్గంలో అనేక ప్రాణనష్టాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను గమనించిన బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ వెంటనే మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ ఫతేనగర్‌కు వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ రైల్వే అధికారులతో చర్చలు జరిపారు.
వెంటనే రైల్వే వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదేశించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రజల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టిన ఈ పనుల పురోగతిని పరిశీలించేందుకు కంచి మహేందర్ తో పాటు బలేష్, కుమార్, సురేష్, దశరథ్, శ్రీనివాస్, లడ్డు, బొట్టు శ్రీను తదితరులు వెళ్లి పరిశీలించారు.
ఫతేనగర్ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రమాదాలకు చెక్ పడడమే కాకుండా,రలేవ ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కంచి మహేందర్ చొరవతో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగుగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


