New Kukatpally CI : నూతనంగా కూకట్పల్లి సిఐగా బాధ్యతలు చేపట్టిన కె.వి సుబ్బారావు

TRINETHRAM NEWS

మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూలై 07: కూకట్పల్లి సీఐగా శనివారం రోజు కె.వి సుబ్బారావు నూతనంగా బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో సోమవారం రోజు కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సీఐ కె.వి సుబ్బారావు మాట్లాడుతూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరు ఏలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని కోరారు.

కూకట్పల్లి జోన్ లోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షిస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన మాట్లాడారు.అలాగే ఎవరైనా చట్టా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారి పైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ కె.వి సుబ్బారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్,జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, సుజాత, సభ్యులు శైలజ,సునీత తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

K.V. Subbarao takes charge

You cannot copy content of this page

Scroll to Top