Lanka Chandranna : వంగవీటి మోహన రంగా, విగ్రహావిష్కరణను రాజకీయం చేయడం సరికాదు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రంగంపేట మండలం సుభద్రంపేట, నల్లమిల్లి గ్రామాలలో ఇటీవల వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వంగవీటి మోహన రంగా, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజకీయంగా మలచడం సరికాదని జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు లంక చంద్రన్న తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రముఖులను ఆహ్వానించటం జరిగిందని, అయితే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అవమానం జరిగిందంటూ రాజకీయంగా విమర్శలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే గతంలో రంగంపేట మండలంలో టీడీపీ హయాంలో ఎన్నడూ కాపు సామాజిక వర్గానికి జడ్పీటీసీ పదవి దక్కలేదని గుర్తు చేశారు. అయితే మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాపు వర్గానికి విశేష ప్రాధాన్యతనిచ్చి రెండు సార్లు జడ్పీటీసీ పదవులు కేటాయించారని తెలిపారు.

అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా అడబాల వెంకటేశ్వరరావు, మండల వైస్ ప్రెసిడెంట్‌గా మట్టా శ్రీను, ని జీవకారుణ్య సంఘం డైరెక్టర్‌గా వీఎస్‌ఎన్ ని, జడ్పీ కో – ఆప్షన్ సభ్యునిగా తనను నియమించారని పేర్కొన్నారు.

ఈ విధంగా కాపు వర్గానికి గుర్తింపు కల్పించిన నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తప్ప మరెవ్వరూ లేరని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో ఒక్కసారి కూడా కాపులకు సరైన గుర్తింపు లభించలేదని ఆయన విమర్శించారు.

ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, మండల వైస్ ప్రెసిడెంట్ మట్టా శ్రీను, మండల యువజన విభాగ అధ్యక్షుడు పేపకాయల మణికంఠ, తోట వెంకటేశ్వరరావు, చెక్కపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vangaveeti Mohana Ranga, It is not right to politicize

You cannot copy content of this page

Scroll to Top