ఆవేదన వ్యక్తం చేసిన, ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి
త్రినేత్రం న్యూస్, కపిలేశ్వరపురం, డిసెంబర్ 28: మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో బ్యాంక్ కెనాల్ నుండి కొండయ్య చానెల్‌కు సాగునీరు విడుదల చేసే కంట్రోలింగ్ తలుపులు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి.
దీంతో బ్యాంక్ కెనాల్ నుండి దిగువకు నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయి, కొండయ్య చానెల్‌కు చేరాల్సిన నీరు వృథాగా డ్రైనేజీలలోకి ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్టి స్పందనా చూపకపోవడం గ్రామవాసుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక మండల పంచాయతీ అధ్యక్షురాలు (ఎంపీపీ) జుత్తుక వెంకటలక్ష్మి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వంతెన దిగువన ఉన్న కొండయ్య చానెల్‌ను పరిశీలించారు. తలుపులు కొట్టుకుపోయిన ప్రదేశంలో భూమిపై నిలబడి, స్థానికులు నెలకొల్పిన కాటన్ దొర విగ్రహం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
“రెండు రోజులుగా బ్యాంక్ కెనాల్ నుండి కొండయ్య చానెల్ గుండా డ్రైనేజీలలో నీరు వృథాగా కలుస్తోంది. సంబంధిత అధికారులు గానీ, స్థానిక ప్రజాప్రతినిధులు గానీ స్పందించకపోవడం శోచనీయం. ఇలా కొనసాగితే రైతుల సాగు ప్రణాళికలు దెబ్బతింటాయి” అంటూ ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి తీవ్రంగా ఆక్షేపించారు.
మండల ఆర్‌టీఐ కన్వీనర్ పిప్పర సంపత్ రావు మాట్లాడుతూ, “వెంటనే కొండయ్య చానెల్‌కు కొత్త తలుపులు అమర్చి, నీటి వృధాను అరికట్టాలి. ప్రభుత్వ నేతలు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మరియు స్థానికులతో చర్చించి, అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి సూరిబాబు, పిప్పర సంపత్ రావు (ఆర్‌టీఐ మండల కన్వీనర్), బొక్క రాంబాబు (మాజీ సొసైటీ ప్రెసిడెంట్), పెంటపాటి వెంకన్నబాబు, చింతా పెద్దకాపు, మరిడి సూరిబాబు, సలాది శ్రీనివాస్, కన్నా శ్రీనివాసు, నీతిపూడి శేఖర్ బాబు, మందపల్లి రవికుమార్, ఎర్రగుంట అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన గ్రామంలో ఇరిగేషన్ వ్యవస్థల పట్ల అధికారుల అలసత్వాన్ని బయటపెడుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


