Ethanol Plant : మోమిన్‌పేట్ లో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇంక ఇక్కడ జీవించలేం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… సహజ వనరుల ధ్వంసాలకు నిలయం గా మారిన వికారాబాద్ జిల్లా!!

డిసెంబర్ 30న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను సరైన సమాచారం లేకుండా, పర్యావరణ ప్రభావ అంచనా (ఈ ఐ ఏ) నివేదికలో లోపాలు ఉండగానే నిర్వహించడం ప్రజాస్వామ్య విరుధం. ఈ పరిశ్రమల వల్ల హానికర వాయువులు, ప్రమాదకర రసాయనాలు విడుదలై భూగర్భ జలాలు, వ్యవసాయం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
వ్యవసాయాధారిత ప్రాంతమైన మోమిన్‌పేటలో  కాలుష్య పరిశ్రమలు స్థాపించడం రైతుల భూములకు, నీటి వనరులకు తీవ్ర హాని చేస్తుంది. నీటి కొరత ఉన్న ఈ ప్రాంతంలో కాలుష్య, నీటి అవసరమెక్కువగా కలిగిన  పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం అన్యాయం.
కావున, ఇతనాల్ కంపెనీ ఏర్పాటు కోసం డిసెంబర్ 30 న  చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేసి, ఈ కాలుష్యకర ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకోవాలి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ethanol plant is set up in Mominpet

You cannot copy content of this page

Scroll to Top