హజ్రత్ ఖాజా సయ్యద్ షా యూసుపొద్దిన్ దర్గా 77వ ఉర్సె షరీఫ్ గంధోత్సవం,
దీపారాధన.
డిండి( గుండ్లపల్లి )డిసెంబర్ 28,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోకొలువైన హజ్రత్ ఖాజా సయ్యద్ షా యూసుపొద్దిన్ దర్గా 77వ ఉర్సె షరీఫ్ ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సంద ర్భంగా విద్యుత్ దీపాలు, పూల మాలల అలకరణతోపాటు భక్తి పాటల నడుమ గంధాన్ని తీసుకెళ్లి స్థానిక మహబూబ్ సుభానీ దర్గా వద్ద ఫాతియాలు నిర్వహించిననంతరం గ్రామ పురవీధుల గుండా తిరుగుతూ భక్తులు దర్గా వద్దకు చేరుకున్నారు.
దర్గాకు దట్టీలు పూల చాదర్లు, మలీదా, బెల్లం పానియాలు సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు .
మరియు ఆదివారం మధ్యాహ్నం దర్గా వద్ద అన్నదానము, ఖవాలి, దీపారాధన కార్యక్రమము ఘనంగా నిర్వహించడము జరిగింది ఈ కార్యక్రమంలో డిండి (గుండ్లపల్లి)సర్పంచ్ నల్లగంతుల రవి, ఉప – సర్పంచ్ మహమ్మద్ కౌసర్ రశీద్, దర్గా పీఠాధిపతి సయ్యద్ షర్పొద్దిన్, డి వి ఆర్, మాజి ఉప సర్పంచ్ నూకం వెంకటేష్, ముడావత్ రవీందర్ (డీలర్) 14వ వార్డ్ మెంబర్ మూడావత్ కవిత భాస్కర్ , మండల యూత్ అధ్యక్షుడు గడ్డమీది సాయి, అబ్దుల్ ఖాదర్, కలీమ్, ఎస్ కే రహీమ్, వావిల్ల సాలయ్య, బాబా, వెంకటయ్య, చాంద్ పాషా, చంద్రయ్య, నారయ్య, దామోదర్ , బాలస్వామి, మల్లయ్య, యాదగిరి, సైదులు, కర్ణాకర్ రెడ్డి, మోసిన్, మణెమ్మ, పార్వతమ్మ, వెంకటమ్మ, చంద్ర కళ, అనసూయ, శాంతమ్మ, వెంకటమ్మ మరియు అధిక సంఖ్యలో భక్తులు , ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


