Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం (గాజులరామారం సర్కిల్) వారి ఆధ్వర్యంలో హెచ్ ఏ ఎల్ కాలనీ లో ఏర్పాటుచేసిన వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మోహన్ రంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమ వీరుడు, రాజకీయ దురంధరుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా ని, రంగా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, గౌరిశెట్టి శివ ఈశ్వరరావు, రవికాంత్, రామకృష్ణ, సోమరాజు, రంగారావు, దుర్గ, వీరబాబు, సత్య, పులి కుమార్, కృష్ణారావు, సత్యారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


