WhatsApp Image 2024 09 19 at 14.25.11
Former MLA and Congress leader Kuna Srisailam Goud participated in Milad Un Nabi celebrations
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఈరోజు చింతల్ డివిజన్ రోడా మేస్త్రి నగర్ ‘మజీద్ అక్సా’, జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్, గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్ లలో జరిగిన ‘మిలాద్ ఉన్ నబి’ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఇస్లాం మత స్థాపకులు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకున్న ‘మిలాద్ ఉన్ నబి’ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ముస్లిం సోదరులందరికీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జహంగీర్ భాయ్, బండి శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ రషీద్, అఫ్జల్, జహంగీర్, తౌసీఫ్, షాకీర్, మధు, జమీల్, జఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
