తేదీ : 24/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలూరు పార్లమెంటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బర. రాజ్ పాల్ కుమార్ నియమితులయ్యారు. పందొమ్మిది వందల ఎనబై మూడవ సంవత్సరం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు . చింతలపూడి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ కు విధేయుడుగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వాణిని రాష్ట్రమంతటా వినిపిస్తానని, జిల్లా అధ్యక్షులు బడేటి.చంటి కి అందుబాటులో ఉండి అప్పజెప్పిన పనిని వంద శాతం పూర్తి చేస్తానని తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన జంగారెడ్డిగూడెం నాయకులకు, ఎమ్మెల్యే, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


