Dr. Satthi : ప్రజలకు ఉపయోగపడే స్థలంపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కక్షపూరిత రాజకీయాలు

TRINETHRAM NEWS
  • అనపర్తి విష్ణాలయం దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఫెన్సింగ్‌ వెయ్యటంపై భక్తులు అసహనం
  • భక్తులు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎమ్మెల్యే చర్యలు
  • కబ్జా జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే, ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్న
  • దేవాలయ కార్యక్రమాలు, భోజనాలు, వాహనాల పార్కింగ్‌కు ఉపయోగపడే స్థలంకు ఫెన్సింగ్
  • ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే
  • భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు
  • లేకపోతే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరిక
  • మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

త్రినేత్రం న్యూస్.. అనపర్తి గ్రామంలో విష్ణాలయం దగ్గర (కీర్తి శేషులు కర్రి అప్పారావు, నివాసానికి ఎదురుగా ఉన్న స్థలం) ఉన్న ఖాళీ స్థలంలో ఫెన్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల తాను ఈ ఫెన్సింగ్ విషయంలో ఎమ్మెల్యే,ని ప్రశ్నించగా, సరైన సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.

పంచాయతీ అధికారులు ఫెన్సింగ్ వేసిన స్థలం గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఎవరో కబ్జా చేశారు కాబట్టే ఫెన్సింగ్ వేశాం” అని చెప్పడం బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. కబ్జా జరిగిందని చెబుతున్నప్పుడు, అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఖాళీ చేయించలేకపోయారు? చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ దమ్ము, ధైర్యం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

ఆ స్థలం అనపర్తి విష్ణాలయం వద్ద జరిగే దైవ కార్యక్రమాలు, అన్నదానాలు, శుభకార్యాలు, అలాగే భక్తుల వాహనాల పార్కింగ్‌కు కీలకంగా ఉపయోగపడుతోందని గుర్తు చేశారు. చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమం జరిగినా అదే స్థలం పార్కింగ్‌కు ఆధారం అవుతుందని తెలిపారు. ఇక రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య కారణంగా, ట్రాఫిక్ జామ్ సమయంలో అటుగా వెళ్లే వాహనాలు ఆ స్థలం ద్వారా తమ వాహనలను మళ్లించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పారు. అలాంటి ప్రజలకు అవసరమైన స్థలాన్ని ఫెన్సింగ్ వేసి మూసివేయడం ప్రజావ్యతిరేక చర్యగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అభివర్ణించారు.

వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని హెచ్చరించారు. మాజీ జడ్పీటీసీ కర్రి దొరబాబు,తో వ్యక్తిగత విభేదాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని, కానీ ప్రజలను హింసించడం తగదన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ,కి గతాన్ని గుర్తు చేస్తూ, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పలు విషయాలను ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు అనపర్తి అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారని, మూడు పార్టీల కలయికతో, ఈవీఎంల మహిమతో, గాలిలో ఎమ్మెల్యేగా, గెలిచారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, విమర్శించారు.

ఇప్పటికైనా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి.లేదంటే భవిష్యత్తులో ప్రజల ఆగ్రహంతో ఫెన్సింగ్ తొలగించే పరిస్థితి వస్తుందని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Ramakrishna Reddy's factional politics on a land that is useful to the people

You cannot copy content of this page

Scroll to Top