Groundnut Auction : డిండి లో వేరుశనగ వేలం

TRINETHRAM NEWS

డిండి, (గుండ్ల పల్లి)డిసెంబర్ 9,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి కేంద్రంలో మంగళవారం వేరుశనగ ను బహిరంగ వేలం నిర్వహించారు. 2024 – 25 యాసంగి సీజన్ లో విత్తనోత్పత్తి క్షేత్రంలో పండించిన 73 క్వింటాళ్ల 80 కిలోల వేరుశనగను నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్యాలయము వారి ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటను నిర్వహించారు.

ఈ వేలంపాటలో శ్రీ విజయ సాయి సూర్యాపేట ట్రేడర్స్, శ్రీరామరికార్డిగేటర్ డిండి ట్రేడర్స్, వెంకటేశ్వర అచ్చంపేట ట్రేడర్స్ పాల్గొనగా, డిండి శ్రీరామ రికార్డ్ గ్రేటర్ ట్రేడర్ గాదే నరేందర్ క్వింటాలుకు 6120 రూపాయల ధరకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఏఓ నల్గొండ ఏ ఏ ఓ కీర్తి, సుపరిండెండెంట్ శ్రీనివాస్, మార్కెట్ సెక్రటరీ రవీంద్ర కుమార్, దిండి అగ్రికల్చర్ ఫామ్ ఏ ఏ ఓ లు రామలింగేశ్వరరావు, వెంకన్న, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ నుండి రాంబాబు, సూపర్వైజర్ చుక్కయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Groundnut auction in Dindi.

You cannot copy content of this page

Scroll to Top