చిన్నారులకు వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి ముస్తాబు కార్నర్లు….
రావులపాలెం మండలం ఈతకోట లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు….
Trinethram News : పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, పరిశుభ్రతను పాటించడానికి, గ్రామాలన్నీ స్వచ్ఛంగా తయారు కావడానికి, ప్రజారోగ్యం కాపాడడానికి, భావితరాల భవిష్యత్తు కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతినెల మూడో శనివారం జరుపుకుంటున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పర్యటిస్తూ చెత్తను సేకరించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ వేరువేరుగా జరుగుతుందా?లేదా అనేది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చెత్తను గ్రామపంచాయతీ అందించిన చెత్త బట్టల్లోని వేయాలని కాలువల్లో, డ్రైనేజీల్లో వెయ్యరాదని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ గ్రామపంచాయతీలు ఇంటింటికి రెండు చెత్త డబ్బాలు అందించాయని, వాటిలోనే చెత్తను వేయాలని వాటిని పంచాయతీ వాళ్ళు అవకాశాన్ని బట్టి రెండు రోజులకు ఒకసారి అయినా సేకరించి తీసుకుని వెళ్తారని డంపింగ్ యార్డ్ లో వేస్తారని అన్నారు.
మన చిన్నతనంలో ప్రతి ఇంటి ముందు ఒక చెత్తకుప్ప ఉండేదని, డ్రైయిన్ లు ఉండేవి కావని కాలానుగుణంగా రహదారులు డ్రైనేజీలు నిర్మించుకొని అభివృద్ధి చెందామని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకుని మరింత ముందుకు వెళ్లాలని తెలిపారు. మన ఇంటిని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో,గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీ లో చెత్త, చెదారం వేసేస్తే మురుగునీరు పారక దోమలు, ఈగలు వ్యాపించి మనకే ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. పరిసరాలు పరిశుభ్రతగా లేకపోతే దోమలు వ్యాపించి వ్యాధులు ప్రబలుతాయని అన్నారు.నా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, నాకేమీ కాదు అనుకోకూడదన్నారు. మనం ఒక్కరు శుభ్రంగా ఉంటే సరిపోదని, మనం ఉన్న ప్రాంతమంతా శుభ్రంగా ఉండాలని తెలిపారు. అప్పుడే వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత ఉన్నప్పుడే దుష్ఫలితాలు దూరమవుతాయన్నారు.
అనంతరం ఆయన గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడుతూ ప్రధానంగా పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలన్నారు.చిన్నారులు అనారోగ్యానికి గురికాకూడదు అంటే మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని అప్పుడే వారికి చదువుకోవడానికి, ఆడుకోవడానికి బాగుంటుందన్నారు. చేతులు,కాళ్ళు కడుగుకుంటూ ఉండి, మంచి బట్టలు వేసుకుని, ఆహారం తీసుకునే ముందు, తీసుకున్న తరువాత టాయిలెట్ కు వెళ్ళి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుగుకోవడం తప్పనిసరన్నారు. విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి నేటి నుంచి పాఠశాల తరగతి గదిలో ముస్తాబు కార్నర్ పెడుతున్నారని తెలిపారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగించేలా ఈ ముస్తాబు కార్నర్ ఉంటుందన్నారు.
ఎవరైతే పరిశుభ్రంగా ఉన్నారో బాలికలు బాలురు విభాగంలో హైజినిక్ లీడర్ షిప్ ఇస్తారని తెలిపారు. ప్రతీ పాఠశాలలో ఈ ముస్తాబు కార్నర్ మొదలుపెడుతున్నామన్నార.చిన్నారులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు తెలిపారు. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని అన్నారు. చిన్నారులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన పెంచితే వారు వారి తల్లిదండ్రులకు సైతం ఆ అంశాలను నేర్పే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతినెల మూడో శనివారం ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అందరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వారిచే ప్రతిజ్ఞ చేయించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


