CITU : మహిళ సెక్యూరిటీ గార్డ్ ను కాళ్లు పట్టుకుని క్షమించమన్న సిఐటి యూ ధర్మ

TRINETHRAM NEWS

సంవత్సరం పాటు విధులకు నిలుపుదల

త్రినేత్రం న్యూస్, కాకినాడ,డిసెంబర్,01: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మహిళా సెక్యూరిటీ గార్డ్ ఫోన్ల ద్వారా లైంగిక వేధించిన సిఐటియు ప్రతినిధి అధ్యక్షుడు ధర్మాను విధులు నుండి తొలగించాలని సోమవారం ఉదయం సెక్యూరిటీ గార్డ్ ఎఫ్ ఆర్ సి కార్యాలయం వద్ద బాధిత కుటుంబీకులు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యూ సి ఆధ్వర్యంలో నిరసన ఆందోళనలు జరిగాయి. మహిళా సెక్యూరిటీ గార్డ్ కు న్యాయం చేయాలని వారికి మద్దతుగా యూనియన్ గౌరవాధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డు పై ఫోన్లో ద్వారా లైంగిక వేధింపులు గురిచేసిన సిఐటియు ధర్మాపై ఆసుపత్రి సూపర్నెంట్ కి, శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ కి శనివారం ఫిర్యాదు చేయడం జరిగిందని కాంట్రాక్టర్ వారు ధర్మాను పిలిపించి మాట్లాడతానని, సోమవారం లోపు ఈ సమస్యను తెలుస్తామని బాధితు కుటుంబానికి హామీ ఇవ్వడంతో వెళ్లడం జరిగిందని. సోమవారం ఉదయం బాధిత కుటుంబాలు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేయగా కాంట్రాక్టర్ వారిని పిలిపించడం జరిగిందని ఆయన అన్నారు. మాజీ సర్పంచ్ మరియు సిఐటియు జిల్లా నాయకులు పలివేల వీరబాబు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ విజయ్ కుమార్ సమక్షంలో మహిళా సెక్యూరిటీ గార్డ్ పై లైంగిక వేధింపులు గురిచేసిన ధర్మాను తీసుకురావడం జరిగింది. మహిళా సెక్యూరిటీ గార్డ్, భర్త కుటుంబీకులతో సహా పెద్దలు మణికంఠ, శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ తరపున శ్రీనివాస్,వర్కర్స్ యూనియన్ తరపున ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఇరువురు సమక్షంలో ఒప్పందం జరిగిందని ఆయన అన్నారు.

ఈ ఒప్పందం అందరి సమక్షంలో ధర్మ తాగిన మైకంలో తప్పుగా బూతులతో ఫోన్లో మాట్లాడానని తప్పు ఒప్పుకోవడం జరిగింది ఆయన అన్నారు. అందరి సమక్షంలో తప్పు ఒప్పుకోవడంతో మహిళా మహిళ సెక్యూరిటీ గార్డ్ కాలును పట్టుకుని క్షమించమని అడగాలని అందరూ చెప్పడంతో కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగాడని, చేసిన తప్పుని ఒప్పుకోవడంతో ఒక సంవత్సరం పాటు విధుల నుండి తొలగించేందుకు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ తరుపున శ్రీనివాస్ అంగీకరించడమైనదని ఆయన అన్నారు. మహిళల సంఘాల నిర్వహిస్తూ మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తుల్ని సి ఐ టి యూ గా ప్రోత్సహించడం, సిగ్గుచేటుగా ఉందని, సిఐటియు కన్వీనర్ మలకా రమణ, ఈ భాగ్యలక్ష్మి ధర్మ ఏ తప్పు చేయలేదని తోకల ప్రసాద్ కావాలని సిఐటియు పై బురద జల్లుతున్నారని పత్రిక ప్రకటన కండన ఇచ్చారు.

సి ఐ టి యూ ప్రతినిధులు ఇప్పటికైనా వాస్తవ వాస్తవాలు తెలుసుకొని పత్రిక ప్రకటన ఇస్తే బాగుంటుందని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారిని సమర్థించొద్దని, ప్రజా సంఘాల ఉద్యమాలతో పాటు సంఘాల ప్రతినిధులకు మహిళలను గౌరవించడం నేర్పించండి అని,ఇంతకుముందు ఒక మహిళ సెక్యూరిటీ గార్డ్ నీదే విధంగా వేధింపులకు గురి చేశారని, ఈమె రెండో మహిళ అని, సిఐటియు సానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఉంటున్న మహిళ కుమార్తె అని, కుటుంబంలో అన్యోన్యంగా బతికే కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య చిచ్చులు పెట్టే పద్ధతులు కాపురాలు విడదీసే తప్పులను చేసేవారిని ప్రోత్సహించకండి అని, ఇలాంటి సంఘటనలు మరొక్క ఏ మహిళా సెక్యూరిటీ గార్డుకు జరిగిన సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ధర్మ ఏ తప్పు చేయలేదని పత్రిక ప్రకటించిన సిఐటియు ప్రతినిధులు తప్పు చేశానని మీ ముందే ఒప్పుకున్నాడని విషయాన్నిగుర్తు ఎరగాలన్నారు. కార్యక్రమంలో మహిళా సెక్యూరిటీ గార్డు మద్దతుగా మధు, కాటూరి రాజు, దుర్గా, మీరాభి, తదితరులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CITU Dharma apologizes for holding the legs of a female security guard

You cannot copy content of this page

Scroll to Top