ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి
దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ నవంబర్ 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం లోని తులచ్చమ్మ కుంట లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం,అభిషేకం మహోత్సవం కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ఆదివారం రోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని .ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్లుగూరి వల్లపు రెడ్డ, పులిరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


