Brutal Murder : ధూళిపాళ్లలో దారుణ హత్య

TRINETHRAM NEWS

ఇంట్లోకి చొరబడి యువకుడిపై దాడి

Trinethram News : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో భయానక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36)పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

ఈ ఘటనలో ఆయన తల్లి కృష్ణకుమారి (55) తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం పరారవుతున్న దుండగులను గ్రామస్థులు చాగల్లు వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదని, నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Brutal murder in Dhulipalla

You cannot copy content of this page

Scroll to Top