జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గ్రామాల్లో ఉత్సహాంగా నామినేషన్లు
జిల్లాలో సర్పంచులకు 162, వార్డు సభ్యులకు 87
అధికంగా, అతి తక్కువ నామినేషన్లు వేసిన స్థానాలు ఇవే
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా మొదలైది. జిల్లాలో గురువారం మొదటి రోజు సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు ఉత్సహాంగా నామినేషన్లు వేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌లో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

జిల్లాలోని 262 పంచాయతీలు, 2198 వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్, కోడంగల్, దౌల్తాబాద్, బొంరాస్ పేట్, దుద్యాల మండలాల్లోని పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లను స్వీకరించారు. తాండూరు మండలంలోని 33 పంచాయతీలలో సర్పంచు పదవులకు 24 మంది, వార్డు సభ్యులకు 11 మంది, బషీరాబాద్ మండలంలోని 39 పంచాయతీలకు 25 మంది, వార్డు సభ్యులకు 10 మంది, యాలాల మండలంలోని 39 పంచాయతీలకు 29 మంది, వార్డు సభ్యులకు 15 మంది, పెద్దేముల్ మండలంలోని 38 పంచాయతిలకు 27 మంది, వార్డు సభ్యులకు 25 మంది, కోడంగల్‌ మండలంలోని 25 పంచాయతీలకు 18 మంది, వార్డు సభ్యులకు 13 మంది, దౌల్తాబాద్‌ మండలంలో33 పంచాయతీలకు 22 మంది, వార్డు సభ్యులకు 10 మంది, బొంరాస్ పేట్ మండలంలోని 35 పంచాయితీలకు 7 మంది, వార్డు సభ్యులకు ఒకరు, దుద్యాల మండలంలోని 20 పంచాయతీలకు 10 మంది, ఇద్దరు వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు.

జిల్లాలోని 262 పంచాయతీలు, 2198 వార్డు సభ్యుల స్థానాలకు మొదటి రోజు సర్పంచ్ పదవులకు 162 అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వార్డు సభ్యుల స్థానాలకు 87 మంది నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు. సర్పంచుల స్థానాలకు అత్యధికంగా యాలాల మండలంలో 29 మంది, అతి తక్కువగా బొంరాస్ పేట్ మండలంలో 7 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యుల స్థానాలకు అత్యధికంగా పెద్దేముల్ మండలంలో 25 మంది, అతి తక్కువగా బొంరాసేట్ మండలంలో ఒకే ఒక నామినేషన్ దాఖలు అయ్యింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

First Day Panchayat Josh

You cannot copy content of this page