కూకట్పల్లి నవంబర్ 27 (త్రినేత్రం న్యూస్) :– ఈ రోజు అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ లో నూతనంగా ప్రారంభమైన గుడివాడ అలంకార్ రెస్టారెంట్ యజమాని మిన్ను ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొని మిన్ను కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమకుమార్ ని నిర్వాహకులు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


