Trinethram News : బెంగళూరు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా కారు కొని సోదరుడికి చూపించి వస్తున్న రియాల్టీ షో డ్యాన్సర్ సుధీంద్ర(36) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కారులో సమస్య ఉండటంతో జాతీయ రహదారిపై దానిని ఆపి పరిశీలిస్తుండగా, వెనుక నుంచి దూసుకొచ్చిన ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుధీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిద్రమత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధీంద్ర కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.. వాటిని పైన ఉన్న వీడియోలో చూడగలరు..!
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


