PPP Policy : పిపిపి విధానాన్ని రద్దు చేయాలి

TRINETHRAM NEWS

మున్సిపల్ చైర్పర్సన్ నుకాదుర్గ రాణి

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 31. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణం 20,27,28వ వార్డుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి నేతృత్వంలో నిర్వహించారు. ఆయా వార్డు కౌన్సిలర్ల తో కలిసి ఈ కార్యక్రమం, నిర్వహించారు.శుక్రవారం ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ, మెడికల్ కాలేజీలు పట్ల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటీకరణ జరిగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నీలం దుర్గ, మొండి భవాని, వైసిపి పార్టీ ఐ టి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు,27వ వార్డు వైసిపి ఇంచార్జి ఈలి తాతాజి,28వ వార్డు వైసిపి ఇంచార్జి జెట్టి బాబూరావు, వైసిపి కార్యకర్తలు చెల్లబోయిన వెంకటలక్ష్మి,పేరూరి మాధవి,బత్తిన దొరబాబు,కోమ్మోజు నాగేశ్వరరావు,కాకాడ నూకరాజు,బలుసుపాటి సూర్యకుమారి,షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PPP policy should be abolished

You cannot copy content of this page

Scroll to Top