Chairperson Rani : పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళిన వైసిపి క్యాడర్

TRINETHRAM NEWS

రైతుల కోసం పోరాటం చేస్తాం…
చైర్ పర్సన్ రాణి…

త్రినేత్రంన్యూస్ : మండపేట ప్లాష్ న్యూస్: అమలాపురం లో వైసిపి చేపట్టిన రైతుకు అండగా వైసిపి కార్యక్రమానికి మండపేట నియోజకవర్గం నుండి వైసిపి నేతలు,కార్యకర్తలు , ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ మండపేట నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

రైతు కు కష్టం వస్తె తమ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే పండించిన ధాన్యాన్ని ఆర్ బి కే లో కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. తడిచిన రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి పరిమిత ఆంక్షలు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అవేదన లో ఉన్నారన్నారు. అనుకూల వాతావరణం లేకపోవడం తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. తక్షణం ప్రభుత్వం దిగి రావాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP cadres who have

You cannot copy content of this page

Scroll to Top