Minister visits Poornachandra : పూర్ణచంద్రరావు ను పరామర్శించిన మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 26/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, కోటపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మంచిన .పూర్ణచంద్రరావు కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని సంబంధిత వైద్యశాలలో చికిత్స పొందడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌరు సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి స్వయంగా ఆ వైద్యశాలకు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం, స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister visits Poornachandra Rao

You cannot copy content of this page

Scroll to Top