ఉబర్ ఓలా యాప్ లను ప్రభుత్వమే నిర్వహించాలి
ఆటో కార్మికులకు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఆటో కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్
ఏఐసిటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికుల ధర్నా
వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ (ఏఐసిటీయూ) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏకశిలా పార్కు నుండి ర్యాలీగా బయలుదేరి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తాటికాయల రత్నం అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి రాష్ట్ర నాయకులు నర్ర ప్రతాపు జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ సాగర్ సంఘo అధ్యక్షులు ఎండీ మహబూబ్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
ఆటో కార్మికులకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులన్నిటిని కాలరాసే విధంగా ప్రైవేట్ పెట్టుబడుదారులకు అనుకూలంగా ఓలా ఉబర్ లాంటి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చి కార్మికుల పొట్టలు కొట్టే ప్రయత్నం కొనసాగిస్తుందని కార్మిక హక్కులని కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను నూతన బానిసత్వం లోకి నెట్టే విధంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సుల మూలంగా ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోయి వారి కుటుంబాలు పోషించుకోలేక దుర్భరమైన జీవితాలు గడిస్తున్నారాని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల బాధలను అర్థం చేసుకొని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ సౌకర్యములు ప్రమాద బీమా సౌకర్యములు కల్పించాలని ఆటోలను ఉచితంగా ఆటో లేని కార్మికునికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వర్తింపజేయాలని మహాలక్ష్మి స్కీం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 4500 రూపాయలు పెన్షన్ సౌకర్యాలని ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు కల్పించాలని ఈఎస్ ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా రవాణా కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళను ఉదృతం చేస్తామని హెచ్చరించారు
ఈ ధర్నా అనంతరం డిఆర్ఓ విజయలక్ష్మి సమస్యలతో కూడిన వినతి పత్రమును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూపీఎన్ ఎమ్ రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న సంఘ అధ్యక్షులు ఎస్.కె మదర్ జిల్లా నగర నాయకులు ఎస్ కే.దస్తగిరి ఎంఏ.సలాం ఎస్డి.యాకూబ్ పాషా. ఎస్.కె మదర్ ఎండి. జానీ ఎస్.డి బాబా రహమతుల్లా ఎండి. ఖలీల్ ఎస్ కే.లతీఫ్ ఎండి.అమిదు ఇర్ఫాన్ ఎండి హజిత్ఎస్ ఎస్డి. సలీం
దామర రమేష్ ఎండి గౌస్ కట్కూరి భాస్కర్ తాటికాయల రాజు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


