సమాజ మార్గదర్శకులు ఉపాధ్యాయులే

TRINETHRAM NEWS

అడిషనల్ ఎస్పీ.మురళికృష్ణ

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 12, తూర్పుగోదావరి జిల్లా, కడియం ఉత్తమ సమాజం తయారవ్వాలంటే అది ఉపాధ్యాయుల మీదే ఆధారపడిఉంటుందని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు అన్నారు. వరదా ఫౌండేషన్ బుర్రిలంక ఆధ్వర్యంలో కడియం, రాజమండ్రి రూరల్ మండలాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, మరియు మెగా డీఎస్సీ 2025 లో ఎంపికైన ఉపాధ్యాయులు 40 మందిని ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో ఎన్. మురళీకృష్ణ అడిషనల్ ఎస్పీ పాల్గొని ఉపాధ్యాయులే సమాజాన్ని ఉద్ధరించే వారిని, ఉపాధ్యాయుడు సరిగా పనిచేయకపోతే ఆ సమాజమే పాడవుతుందన్నారు. అలాగే జి. భీమారావు, మధుసూదన రావు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వెలుగుబంటి రఘురాం, ఎంఈఓ నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సత్యనారాయణ పాల్గొని సన్మాన గ్రహీతలకు, నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుడు రాంబాబు, తులసి వరదా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గత నాలుగు సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థులకు లక్షల రూపాయలు నగదు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న వరదా ఫౌండేషన్ ఆర్గనైజర్ వరద సుబ్బారావు డిప్యూటీ కలెక్టర్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు కొనియాడారు. సుబ్బారావు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చిలుకూరు శ్రీనివాస్, గొల్లపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి. అభివృద్ధి కమిటీ. డైరెక్టర్. చిరు కూరి ప్రభా.ను.బి. సుధ, అనిత, రాజేశ్వరి, మంగాదేవి మొదలగు వారు సన్మానింపబడ్డారు. డీఎస్సీలో జిల్లాలో రెండో స్థానం సాధించిన వెలుగుబంటి అన్నపూర్ణను ప్రత్యేకంగా డీఈఓ అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Teachers are the guides of society

You cannot copy content of this page

Scroll to Top