బాధిత కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూపు, మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
రాయవరంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలచి వేసింది.
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 12. రాయవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయం ప్రకటించకుండా. ఇటీవల రాయవరం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ కలచి వేసింది. అయితే, మొద్దు నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టడంలో విఫలమైంది. ప్రస్తుతం, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. పోలీసులు విచారణ పేరుతో బాధితు కుటుంబాలను మరింత క్షోభకు గురించేస్తున్నారు.
సహాయం ఇవ్వకపోవడం వలన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి నిరాకరించారు. అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరి, మాజీ మంత్రివర్యులు మరియు తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తో కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఐదు రోజులలో ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇస్తారని అధికారులు స్పష్టం చేశారు.ఇవ్వని పక్షంలో బాధిత కుటుంబాల తరఫున నిరసనకు దిగుతామని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు.
మహాలక్ష్మి పేటకు చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు పుండరీ వాసు (ఉల్లిపాయల శ్రీను) మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో లక్ష్మీ గణపతి ఫైర్‌వర్క్స్ యజమాన్యంతో నష్టపరిహారం గురించి సంప్రదించి, హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వం స్పందన లేకపోవడం, మొద్దు నిద్రలో ఉన్న పరిస్థితి కొనసాగుతోండి. బాధిత కుటుంబాలకు సహాయం పొందడానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. బాధితులు, కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


