AITUC : తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ కార్మికులకు సమస్యలపై పోరాడాలి!

TRINETHRAM NEWS

ఏఐసి టీయూ వరంగల్ జిల్లాప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి పిలుపు

వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఏఐసి టీయూ ఆధ్వర్యంలో వర్ధన్నపేట బస్టాండ్ దగ్గర బుక్యా యాకూబ్ అధ్యక్షతన ఆటో ట్రాలీ డ్రైవర్స్ సమావేశం జరిగింది కార్యక్రమంలో ఏ ఐ సి టి యు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి జిల్లా అధ్యక్షులు సుంచు జగదీశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆటో కార్మికులకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులన్నిటిని కాలరాసే విధంగా పెట్టుబడుదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను నూతన బానిసత్వం లోకి నెట్టే విధంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సుల మూలంగా ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోయి వారి కుటుంబాలు పోషించుకోలేక దుర్భరమైన జీవితాలు గడిస్తున్నారాని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల బాధలను అర్థం చేసుకొని వారికి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ సౌకర్యములు ప్రమాద బీమా సౌకర్యములు కల్పించాలని ఆటోలను ఉచితంగా ఆటో లేని కార్మికునికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసం బిజెపి ప్రభుత్వం ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వర్తింపజేయాలని మహాలక్ష్మి స్కీం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 4500 రూపాయలు పెన్షన్ సౌకర్యాలని ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు కల్పించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా రవాణా కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఆటో ట్రాలీ డ్రైవర్ వరంగల్ జిల్లా కార్యదర్శి తాటికాయల రత్నం కన్న0 కుమార్ .సు .మా0గ్య రమేష్ .చెప్పు. శంకర్ క. శ్రీనివాస్ ఎం.సంపత్ జన్ను స్వామి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Auto Trolley Drivers Union workers

You cannot copy content of this page

Scroll to Top