మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి అని తెలిపారు
అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి విషయాన్ని తీసుకు వెళ్ళడం జరిగిందని తెలిపారు
త్రినేత్రం న్యూస్,ప్రతినిధి రమ్యశ్రీ. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం గ్రామంలో అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన రాయవరం వెళ్లిన ఆయన అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ తరలించి అక్కడ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి కారకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగిందని, మృతి చెందిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


