Trinethram News : వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడికి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సనాతన హిందూ ధర్మం పేరిట RSS, BJP మద్దతుతో ఒక అడ్వకేట్ బూటు విసరడం భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ విలువలపై ప్రత్యక్ష దాడి అని ఖండించారు.
దళిత సమాజానికి చెందిన గవాయ్, అంబేద్కర్ చూపిన మార్గంలో రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉన్నారని, అలాంటి వ్యక్తిపై దాడి జరగడం అంటే అంబేద్కర్ ఆలోచనలపైనే దాడి జరగడం అని అన్నారు. ఇటువంటి సంఘటనలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మచ్చలుగా నిలుస్తాయని, న్యాయవ్యవస్థ గోడలకే మతోన్మాదం చేరడం దేశ భవిష్యత్తుకు ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే కాషాయ శక్తులను ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడు, యువత, మేధావులు, సామాజిక ఉద్యమకారులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడే వారిపై దాడి జరగడం అంటే దేశ ఆత్మపైనే దాడి జరగడం అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి వంటి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణం ఆ అడ్వకేట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరాజు, బూరుగుల నాగరాజు సహదేవుడు, చిన్నదాసు, బర్కం రమేష్, బిజ్జ వెంకటేష్, దాసరి బాబు, ఏ. రమేష్, లేంకపల్లి శివకుమార్, పెద్దదాసు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


