10 వేల రూపాయల నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటిన సేవా దృక్పథం
పేదలకు చేయూత ఇవ్వడమే మా లక్ష్యం – అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు జాధవ్ సుశీల్, జాటోత్ దవిత్ కుమార్
Trinethram News : లింగాపూర్: లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన జాటోత్ హనుమంతు నాయక్ (70) గత కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. వారి పెద్దకర్మ సందర్భంగా, అభ్యుదయ ఫౌండేషన్ సంస్థ ఆ పేద కుటుంబానికి బుధవారం అండగా నిలిచింది. అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు జాధవ్ సుశీల్, జాటోత్ దవిత్ కుమార్ ఆధ్వర్యంలో ₹10,000/- రూపాయల నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులకు అందజేశారు. అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
పేద కుటుంబాలు ఎదుర్కొనే కష్ట సమయంలో చేయూత ఇవ్వడం మనిషితనానికి ప్రతీక అని సభ్యులు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు కోరారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రజల పట్ల బాధ్యతగా నిలబడటం, అలాంటి వారికి అండగా ఉండటమే మా అభ్యుదయ ఫౌండేషన్ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాధవ్ మారుతి, జాధవ్ రంజిత్, రాథోడ్ రాజేష్, రాథోడ్ ధర్మేంద్ర, జాధవ్ సాయికుమార్, రాథోడ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు!!
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


