తేదీ : 08/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం పట్టణంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పర్యటించారు. ఏలూరు రోడ్డు రోటరీ కమ్యూనిటీ హాల్ లో బాపూజీ సీనియర్ సిటిజెన్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ , లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాళ్లకు సంబంధించిన వివరాలు ప్రసంగించారు. అనంతరం మున్సిపాలిటీ దగ్గర నుంచి శ్రీనివాసపురం జంక్షన్ వరకు రూపాయలు ఒకటి.నాలుగు సున్న లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు
ఈ రోడ్డు నిర్మాణం ఆర్ మరియు బి నిధుల నుంచి జరుగుతుందని తెలిపారు. పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు టి. నరసాపురం మండలం, బొర్రంపాలెం గ్రామంలో పర్యటించారు. బొర్రంపాలెం నుండి రావికంపాడు అడ్డ రోడ్డు వరకు సుమారు రూపాయలు నాలుగు. రెండు రెండు లక్షల వ్యయంతో నూతనంగా నిర్వహించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ రహదారి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని ఆయన అన్నారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ వాళ్లు పేదలకు ఈ చలికాలంలో దుప్పట్లు కొనుగోలు చేసే పరిస్థితి లేని వాళ్లకు దుప్పట్ల పంపిణీ చేశారు. వాళ్లందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


