CITU : వెల్ఫేర్ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి.

TRINETHRAM NEWS

ఎస్.రామ్మోహన్ రావు,BCWU – సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సీఐటీయూ అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ శ్రామిక భవన్,గోదావరిఖని లో నిర్వహించడం జరిగింది. యూనియన్ జిల్లా అధ్యక్షులు తుంగపిండి మల్లేష్ జెండావిష్కరణ చేసి,అధ్యక్షత వహించారు సీఐటీయూ గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఎం.సారయ్య ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల కుమారస్వామి గడిచిన 3 సంవత్సరాల ఉద్యమ, కార్యక్రమాల రిపోర్ట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. హాజరైన ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెల్ఫేర్ బోర్డు నుండి కాకుండా జీ.ఓ. నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారు అన్నారు. దీన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్స్ ఇవ్వాలని, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. రాబోవు రోజుల్లో జిల్లాలో కార్మికుల సమస్యల మీద మరిన్ని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.అనంతరం మహాసభలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, లేబర్ అడ్డాలపై కనీస సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ క్లెయిమ్ వెంటనే పూర్తి చేయాలని, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు వెల్ఫేర్ బోర్డు ను అప్పచెప్పకుడదనీ, 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలని,ఆన్ లైన్ సమస్యలు పరిష్కరించాలని తదితర తీర్మానాలు చేయడం జరిగింది ఈ మహాసభలలో నాయకులు సీపెల్లి రవీందర్,గుండు కనకయ్య, సత్యనారాయణ, విజయలక్ష్మీ,భారతి, సదానందం, పరమేశ్, శేకర్,మదు,మహేందర్, పోచం,సమ్మయ్య,స్వామిహరీష్,అంజయ్య,అశోక్,చెందర్,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Benefits should be provided to building workers

You cannot copy content of this page

Scroll to Top