Riyaz Ahmed : ఎఐటియుసి పై ఆరోపణలు చేసి, నిరూపణకు, బహిరంగ విచారణ కు రాకుండా తోక ముడిచిన రియాజ్ అహ్మద్

TRINETHRAM NEWS

గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు సూటబుల్ జాబు ఒప్పందం చేసుకున్న ఎఐటియుసి పై ఆరోపణలు చేసి, నిరూపణకు, బహిరంగ విచారణ కు రాకుండా తోక ముడిచిన రియాజ్ అహ్మద్.

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, మడ్డి ఎల్లా గౌడ్ లు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) 2025 సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ను బహిరంగ చర్చకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ కు రావాలని చెప్పినప్పటికీ రాకుండా తోక ముడిచాడని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) ఉప ప్రధాన కార్యదర్శులు వై.వి రావు, మడ్డి ఎల్లా గౌడ్ లు మండి పడ్డారు. ఆదివారం ఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో 2009 నవంబర్ 20 న మరియు 2025 సెప్టెంబర్ 25 న జరిగిన ఒప్పంద పత్రాలను వారు తీసుకొని హాజరై మాట్లాడుతూ గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబు విషయంలో గతంలో ఉన్న అర్హతలకు అదనంగా డిగ్రీ, పీజీ చేసిన వారికి కూడా వర్తింపజేయాలని 2025 సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఎఐటియుసి ఒప్పందం చేసుకుంటే, దాన్ని వక్రీకరిస్తూ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఎఐటియుసి పై బురద జల్లే విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టిస్తూ, సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కార్మిక సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడేది కేవలం ఎఐటియుసి మాత్రమేనని కార్మిక వర్గం గ్రహించాలని వారు పేర్కొన్నారు.

హెచ్చెమ్మెస్లొ నాడు పని చేసిన నీ తోటి సహాచరులైన మేరుగు రాజయ్య, నారాయణ రెడ్డి, యాదగిరి సత్తయ్య, దశరథం గౌడ్, వీరాస్వామి తదితరులు నీ నియంతృత్వ పోకడలు భరించలేక నేడు ఎక్కడ ఉన్నారో రియాజ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని వారు పేర్కొన్నారు, నీ యూనియన్ లో పని చేసిన నాయకులను ట్రాన్స్పర్లు చేస్తే, చార్జిషీట్ లు ఇస్తే కాపాడుకోలేని నువ్వు, వంద ఏండ్ల చరిత్ర కలిగిన ఏఐటియుసి ని విమర్శించడమంటె ఆకాశం పై ఉమ్మివేసినట్లేనని వారు ఎద్దేవా చేశారు. అంతే కాకుండా మీ స్వంత యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేస్తె అడ్డుకోలేని నువ్వు ఏఐటియుసి పై విమర్శలు తగదని వారన్నారు. నాడు నాయిని నర్సింహారెడ్డి ని ముంచినట్టు నేడు కవిత ను కూడా ముంచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వారు అన్నారు. ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో పోజులకె పరిమితమయ్యారు తప్ప కార్మికుల హక్కుల కోసం పోరాడిన దాఖలాలు ఏనాడూ లేవని వారు పేర్కొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోకపోతే కార్మికులే తగిన బుద్ధి చెప్తారని, ఇప్పటికైనా రియాజ్ అహ్మద్ సోషల్ మీడియా లో ఫోజులు మాని, అగ్రిమెంట్లపై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్తులో తమ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని కార్మిక వర్గ సమక్షంలో ప్రత్యక్ష, ప్రతి చర్యలకు పాల్పడతామని వారు హెచ్చరించారు.

ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కందుకూరి రాజారత్నం, జూపాక రాంచందర్, అర్జీ వన్, టూ, త్రీ బ్రాంచి కార్యదర్శులు ఆరెల్లి పోషం, జీగురు రవిందర్, మందల రాంచంద్రారెడ్డి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, నాయకులు మాదన మహేష్,రంగు శ్రీను, బోగ సతీష్ బాబు, ఆకునూరి శంకరయ్య, సిర్ర మల్లికార్జున్, మానాల శ్రీనివాస్, నాయిని శంకర్, బలుసు రవి, గుర్రం ప్రభుదాస్, కారంపూరి వెంకన్న, చెప్యాల భాస్కర్, గొడిశల నరేశ్, వై.లెనిన్ , కండె కీర్తి శేఖర్, పొన్నం రంజిత్, మోటపలుకుల మహేందర్, వెంకటస్వామి, పూరెల్ల శ్రీనివాస్, అగ్గు శ్రీనివాస్, వి.గట్టయ్య, పొనగంటి రాజయ్య, వెంకటేష్, సాదరి రమేశ్, కుమారస్వామి, అనిల్, దాముక శ్రీనివాస్, వీరస్వామి, బండారి మల్లేష్, పోషం, దుగ్యాల తిరుపతి రావు, బండారి క్రాంతి, అమరగొండ పోషం, కె.సంపత్, కె.మల్లెశ్, నక్క రమేశ్, గందం శ్రీనివాస్, నరేశ్, శ్రీనివాస రెడ్డి, లక్ష్మయ్య, ధర్మయ్య ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Riyaz Ahmed, who made allegations against the AITUC

You cannot copy content of this page

Scroll to Top