సంభందం లేని బీజేపీ చరిత్రను వక్రీకరించే కుట్రలు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూo బుచ్చిరెడ్డి.
డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 17 త్రినేత్రం న్యూస్. నైజాంను తరిమికొట్టి ప్రజలకు స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలను అందించిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తున్నదని సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూo బుచ్చిరెడ్డి అన్నారు.బుధవారం డిండి మండల కేంద్రంలోనీ సిపిఐ కార్యాలయం ఎదుట సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్బంగా జాతీయ జండాను బొడ్డుపల్లి వెంకటరమణ, సిపిఐ జండాను తూం బుచ్చిరెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…
మట్టి మనుషులే మర ఫిరంగులై భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కొరకు సామాన్యులు ఎర్రజండాలను చేతబట్టి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పోరాటంలో నాలుగున్నర వేల మంది అమరులయ్యారు.అయినా వెన్ను చూపని దైర్యంతో నిజాం ను తరిమికొట్టారని అన్నారు.గ్రామాల్లో ఎక్కడ చూసిన ఇప్పటికి ప్రజలకు సాయుధ పోరాటం తెలుసనీ,సాయుధ పోరాటం చేసిన వారు సైతం ఉన్నారని ఏదేమైనా కమ్యూనిస్టుల చరిత్రను రూపు మాపాలని సాయుధ పోరాటానికి ఏమాత్రం సంభంధం లేని బీజేపీ నేడు చరిత్రను వక్రీకరించే కుట్రకు తెరలేపిందని హిందూ ముస్లిం గొడవలుగా సాయుధ పోరాటాన్ని బీజేపీ చిత్రికరించడం ప్రజలు గమనించాలని అన్నారు.బీజేపీ కుట్రలు ప్రజలు తిప్పికొట్టాలనీ కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎండీ. మైనోద్దీన్,సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్,మండల కార్యవర్గ సభ్యులు నూనె వెంకటేశ్వర్లు, సోమిడి శ్రీనయ్య,ఎలిమినేటి హుస్సేన్, కేశవులు తదితరులున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


