చర్యలు తీసుకోవాలని డిమాండ్…
త్రినేత్రం న్యూస్ సెప్టెంబర్ 16. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలో గుంపులు గుంపులుగా కుక్కలు సైర్వ విహారం చేస్తున్నాయనీ వైసిపి కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ విమర్శించారు. కౌన్సిల్ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ ఇదే దుస్తితి వుందన్నారు. సైకిల్ పై వెళుతున్న వారిని వెంటబడి కరుస్తున్నట్లు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.గతం లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలను దూరంగా తరలించే వారన్నారు. ఇపుడు కుక్కలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. తన వార్డు లో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు కు ప్రతిపాదనలు ఇచ్చానని చెప్పారు.
తక్షణమే కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడిద బై పాస్ రోడ్ లో పెద్ద లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. టిడిపి కౌన్సిలర్ చుండ్రు సుబ్బారావు చౌదరి మాట్లాడుతూ వాణీ మహల్ వద్ద సెంటర్ డివైడర్ ను ఏదో వాహనం డి కొట్టిందని చెప్పారు. దీంతో రోడ్ పై వ్యర్థాలు అడ్డుగా ఉన్నాయన్నారు. పట్టణ సుందరీకరణ అంటున్నారని పేర్కొన్నారు. దీన్ని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


