Disciplined Education : క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన

TRINETHRAM NEWS

తేదీ : 21/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొయ్యలగూడెం మండలం లో ఉన్నటువంటి అచ్చుతాపురం, పొంగుటూరు, కనకాద్రి పురం, కుంతల గూడెం, ద్వారకాతిరుమల మండలంలో ఐ ఎస్ రాఘవాపురం, జంగారెడ్డిగూడెం మండలంలో టెక్కీన వారి గూడెం, లక్కవరం గ్రామాలలో ఉన్నటువంటి మండల పరిషత్ మరియు, ఫౌండేషన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఎస్.కె తాజేష, రాజ్ కుమార్, వెంకటేశ్వరరావు, అనిల్ కుమార్, రత్నకుమార్, నాగరాజు రాజు, ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మరియు కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారో తెలిపారు.

ప్రభుత్వ సమయం ప్రకారం పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు మొదలైనవి శక్తినిచ్చే ఆహార పదార్థాలను అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా రోజు విడిచి రోజు రాగిజావ, వేరుశనగ గింజలు బెల్లం తో తయారు చేసేటువంటి చిక్కీలు ఇస్తున్నామని సూచించారు. ఇవన్నీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద అందిస్తున్నామని సన్న బియ్యంతో కూడిన అన్నముతో పెడుతున్నామని తెలపడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర సంబంధించి విద్యార్థులకు సంబంధిత సామాగ్రి అందించామని, అర్హత ఉన్న విద్యార్థుల అందరకు, వాళ్ల తల్లుల బ్యాంకు ఖాతాలో తల్లికి వందనం రూపాయలు పడ్డాయని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ఆటలు మొదలైనవి నేర్పిస్తున్నామని అనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Disciplined education

You cannot copy content of this page

Scroll to Top