వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ గౌడ్ సబ్బండ వర్గాల సమానత్వం, వారి సంక్షేమం కోసం ఎన లేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశం హాలు నందు వెనుకబడిన తరగతుల శాఖ అధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న 1650 లో జన్మించారని, తండ్రి మరణించగా తల్లి ఆదేశాలతో గౌడ కులవృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తూ భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డ పై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజరాజ్యాన్ని నిర్మించారని అన్నారు.
కుల మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమసమాజ ప్రజాస్వామిక స్పూర్తితో నాటి కాలంలోనే పాపన్న గౌడ్ పోరాటం గొప్ప విషయమని అన్నారు. ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపన చేసిన సర్వాయి పాపన్న అందరికి అధర్శనీయుడని , బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్వాయి పాపన్న గౌడ్ ను స్పూర్తిగా తీసుకోవాలన్నారుఈకార్యక్రమములో డి ఆర్ ఓ మగ్లి లాల్ , ఆర్, డి ఓ, వాసుచంద్ర, బి సి వెల్ఫేర్ అధికారి ఉపేందర్ , జిల్లా అధికారులు , కార్యాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


