వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారము సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ భూ సమస్య లు,ఇందిరమ్మ ఇల్లు ,ఎలక్ట్రిసిటీ , గ్రామ పంచాయతి , విద్యా శాఖ, ఆసరా పెన్షన్ లకు సంబందించి ఫిర్యాదు లు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.
జిల్లా అదికారులనుద్దేశించి జిల్లా లో జరిగే స్కూల్స్ పెయిన్ టింగ్ పనులు , మైనర్ రిపేర్ పనులు, బయో మెట్రిక్ అటెండెన్స్, ప్యాడి ప్రోక్యూర్ మెంట్, విద్యుత్తు పలు అంశాల పై సంబంధిత అధికారులతో అరా తీశారు. బయో మెట్రిక్ అటెండెన్స్ వంద శాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి , డి ఆర్ ఓ మంగీ లాల్, ఆర్ డి ఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎ ఓ పర్హీన బేగం, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


