Mumma Reddy Prema Kumar : సన్ ఎక్స్ టెక్నాలజీస్ ను ప్రారంభించిన ముమ్మ రెడ్డి ప్రేమ కుమార్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 14 : ఈ రోజు కెపిహెచ్బి కాలనీ లోని సన్ ఎక్స్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌ అడబాల షణ్ముఖ ఆహ్వానం మేరకు, జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జి మమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులకు సాంకేతిక విద్య ప్రాధాన్యతపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన, నేటి యువత కంప్యూటర్ మరియు సాఫ్ట్‌వేర్ రంగంలో నైపుణ్యం సంపాదించి సమాజానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు.

అలాగే ప్రాంతీయ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విస్తృతంగా పాల్గొన్నారు. కోచింగ్ సెంటర్‌లో వివిధ సాంకేతిక కోర్సులు, ప్రోగ్రామింగ్ భాషలు, మరియు కెరీర్ మార్గదర్శక శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో స్నేహపూర్వకంగా చర్చలు జరిపి, వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేముల మహేష్, పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mumma Reddy Prema Kumar

You cannot copy content of this page

Scroll to Top