వరంగల్ జిల్లా 14ఆగస్టు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రంలో ఉన్న వారు అధైర్య పడవద్దని జిల్లా యంత్రాంగం అండగా ఉందని డాక్టర్ బి. సాంబశివరావు అన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ నగరంలోని జలమయమైన లోతట్టు ప్రాంతాలైన రామ్ మందిర్ నిర్వాసితులకు పోతన రోడ్ లోని మరాఠీ భవన్లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని డాక్టర్. సాంబశివరావు గురువారం సందర్శించి అందుతున్న వైద్య సదుపాయాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు.
బిపి పరీక్షించి ఎక్కువ ఉన్న ఇద్దరినీ అంబులెన్స్ ద్వారా ఎంజీఎం హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో జ్వరం ఉన్నవారికి మలేరియా డెంగు టెస్టులు ,షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బి. సాంబశివరావు మాట్లాడుతూ… మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పునారావస కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని, జిల్లా యంత్రాంగం అహర్నిశలు ప్రజల రక్షణ కోసం పాటుపడుతుందని ఎవరు ఆందోళన చెందకూడదని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ డాక్టర్ మేరుగు యశస్వినీ, పి.పి యూనిట్ సూపర్వైజర్ నర్మదా, ఏ.ఎన్.ఎం.లు కోమల, లక్ష్మీబాయి , రాజా సులోచన, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


