Varalakshmi Vratam : బత్తుల వారి ఇంట ఘనంగా వరలక్ష్మి వ్రతం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. రాజానగరం, ఆడపచులకు ఎంతగానో ప్రియమైన పండుగ వరలక్ష్మి వ్రతం. అలాంటి ఈ పండుగ రాజానగరం నియోజక వర్గం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ, ఇంట అత్యంత వైభవంగా జరిగింది. జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి, తమ సౌభాగ్యాల కోసమే కాకుండా, తమ నియోజక వర్గంలో ఉన్నటువంటి అందరి ఆడపడుచుల సౌభాగ్యాల కోసం ఈ పూజను పూజారుల సమక్షంలో జరుపుకున్నారు.

దేవి తల్లికి అనేక రకముల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు. ముత్తైదువులను పిలిచి వారికి తాంబుళం అందజేశారు. తన కుటుంబం తో పాటుగా రాజానగరం నియోజక వర్గం లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Varalakshmi vratam is celebrated in Battula's house

You cannot copy content of this page

Scroll to Top