Lakshmi Temple : అనపర్తి లక్ష్మీ గుడికి పోటెత్తిన మహిళా భక్తులు

TRINETHRAM NEWS

మహాలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమివ్వగా తరించిన భక్తులు

అనపర్తి:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, శ్రావణ మాసం అనగానే మహిళలు ఎంతో ప్రాముఖ్యత నిచ్చే మాసం అని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు శుక్రవారం వారాలు రావడం ఈసంవత్సరం ఐదు శుక్రవారాలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటివారం,రెండవవారం పెద్దగా ఎవరూ ఆచరించకపోవడంతో పౌర్ణమి ముందు వచ్చిన శ్రావణశుక్రవారం కావడం తో మూడవ వారంలో తాకిడి ఎక్కువగానేఉంది.

శ్రావణ మాసం పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాంతిపురంలోని శ్రీ గణపతి శ్రీ సరస్వతి సహిత మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు తో పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమివ్వగా ఆలయ అర్చకుడు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించు కునగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం లక్ష్మీదేవి గుడి కమిటి తీర్థప్రసాదాలు అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

devotees flock to Anaparthi Lakshmi temple

You cannot copy content of this page

Scroll to Top