ఇన్చార్జిలను రద్దుచేసి పర్మినెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్లను నియమించాలి

TRINETHRAM NEWS

పారిశుద్ధ్య కార్మికులకు రైన్ కోట్స్,యాప్రాన్, యూని ఫారంలు మంజూరు చేయాలి….

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులసమస్యలు పరిష్కరించాలని సర్కిల్లో పర్యటించడం జరిగింది. ఈ సర్కిల్ పర్యటనకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సానిటరీ ఇన్స్పెక్టర్లు రిటైర్డ్ అయిన వారి స్థానంలో ఇన్చార్జిలను నియమించి పబ్బం గడుపుతున్నారని, దీనివల్ల కార్మికులకు రావాల్సిన రాయితీలు అమలు చేయడంలో వారు అలసత్వం వహిస్తున్నారని, దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే స్పందించి పర్మినెంట్ ఇన్స్పెక్టర్ల నియమించే విధంగా చొరవ చూపాలని,తద్వారా శానిటేషన్ మెరుగుపడుతుందని ప్రసాదన్నారు.

పారిశుధ్య కార్మికులకు మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అనారోగ్యం బారిన పడకుండా,చర్మవ్యాధులు రాకుండా కనీస 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు చేయించాలని ఆయన అన్నారు. 12 సర్కల్లో మహిళలకు అవసరతను బట్టి సి.ఎల్ అడుగుతున్న అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, సర్కుల్లో పుష్ గాడ్ల కొరత తీవ్రతంగా ఉందని,వర్షాకాలం వస్తున్న రైన్ కోట్స్ మంజూరు చేయడం లేదని, ఎఫ్రాన్, గ్లౌజులు, యూనిఫామ్ లు తక్షణమే ఇవ్వాలని, పారిశుధ్య కార్మికుల పట్ల చులకన భావంతో ప్రవర్తిస్తే సహించేది లేదని ఆయన అన్నారు.

రిపేర్ అయిన కంఫర్ట్ వెహికల్,ఉపర్ టిప్పర్ వెహికల్లను రిపేర్లు అధికారులు అలసత్వం వహిస్తున్నారని, దీనివల్ల పని భారం పెరుగుతూ కాకినాడ కార్పొరేషన్ లో ఎక్కడకక్కడక చెత్త పేర్కొని పోతుందని, ట్రాక్టర్ల పై ప్రభావం పడుతుందని, తక్షణమే రిపేర్లో ఉన్న వెహికల్లను రిపేర్ చేయించాలని, ఆయన అన్నారు. అధికారులు అలసత్వాన్ని విడనాడి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే పారిశుధ్యకార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, సత్యనారాయణ, నాగేశ్వరరావు,కృష్ణ, రమణమ్మ బేబీ కుమారి అరుణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

abolished and permanent sanitary inspectors

You cannot copy content of this page

Scroll to Top