Mangala Gauri Vratas : భక్తి, శ్రద్ధలతో… సౌభాగ్య మంగళ గౌరీ వ్రతాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిది, అనపర్తి పాత ఊరులో గల శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు రెడ్డి సీతారామ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు బాదంపూడి కాళీరామలింగేశ్వర శర్మ, కామేశ్వర శర్మ, సత్య ప్రకాష్ శర్మల ఆధ్వర్యంలో మహిళలు సామూహిక మంగళ గౌరీ వ్రతాలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమాల్లో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచాగవ్య ప్రాసన, మండపారాధన, శ్రీ చక్రనవావర్ణనఅర్చన, అభిషేకం, కుంకుమార్చన చేశారు. గోపూజ తదితర క్రతువులను జరిపించారు. ఈ సందర్భంగా సౌభాగ్య మంగళ గౌరీ వ్రతాలు సాంప్రదాయ పద్దతిలో జరిపించిన రుత్విక్ లను భక్త బృందం ఘనంగా సత్కరించింది. అనంతరం భక్తులకు ఆలయకమిటీ సభ్యులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

 Auspicious Mangala Gauri Vratas

You cannot copy content of this page

Scroll to Top