ఇప్పటికీ పాతవాళ్లకు పెన్షన్ పెంపు చేసి ఇస్తున్నాం
పెన్షన్ పొందే వ్యక్తి చనిపోతే… తక్షణం నామినీకి పెన్షన్ ఇస్తాం
ఈనెలలోనే కొత్త రేషన్ కార్డులను అందించబోతున్నాం
గత వైసిపి ప్రభుత్వంలో నాణ్యతలేని లిక్కర్ సరఫరా
ఫలితంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు మూడు నెలల్లో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు కొత్తవి మంజూరుచేసి అందిస్తామన్నారు. స్థానిక 40వ వార్డు, మూలగొయ్యి అవసరాలకు తగిన విధంగా చేపట్టిన నూతన డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల అధికారులకు సూచించారు. ఈసందర్బంగా స్థానికులు తమకు పెన్షన్ రావడం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పందిస్తూ అర్హులందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. గత వైసిపి మాదిరిగా ఏడాదికి రూ. 250 చొప్పున కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ అందిస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు.
అలాగే వికలాంగులకు రూ 6వేలు ఇస్తామని చెప్పి ఇస్తున్నామని, బెడ్ రిడెన్ అయితే రూ 15వేలు, డయాలసిస్ కి రూ 10వేలు ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. కొత్త పెన్షన్లు ఇచ్చే లోగ పాత పెన్షన్ దారుల్లో ఎవరైనా చనిపోతే తక్షణమే నామినీకి పెన్షన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఆవిధంగా సిటీ నియోజకవర్గంలో 375మందికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని ఆయన హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఇలాంటి విషయాలను ప్రజలు గమనించాలన్నారు.
గత ఐదేళ్లలో అర్హత గల కొత్తవారికి ఒక్కరికైనా పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించగా లేదని జనం నుంచి సమాధానం వచ్చింది. తన భర్త రెండేళ్ల క్రితం లివర్ పాడైపోయి చనిపోతే, అతడికి ఇచ్చే పెన్షన్ తనకు రాయండి బాబూ అని తిరిగినా తనకు పెన్షన్ ఇవ్వ లేదని ఒక మహిళ ప్రస్తావించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ వచ్చిందని ఆమె ఆనందంతో చెప్పారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో లిక్కర్ తాగేవాళ్ళు ఉన్నారని కానీ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే లివర్ వ్యాధి బారిన ఎందుకు పడ్డారో గమనించాలని ఈ సందర్బంగా ప్రస్తావించారు.
గత వైసిపి ప్రభుత్వం డబ్బుకి కక్కుర్తి పడి నాణ్యతలేని లిక్కర్ సరఫరా చేయడం వలన అది తగినవాళ్లు లివర్ వ్యాధుల బారిన పడ్డారని, ఇందులో కొందరు చనిపోయారని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో గత ప్రభుత్వం చెలగాటమాడి ఆడవాళ్ళ పుస్తులు తాకట్టు పెట్టడమే కాదు, తెంచారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరిందన్నారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన లిక్కర్ సరఫరా అవుతోందన్నారు. మద్యం మీద సంపాదించాలని వైసిపి ప్రభుత్వం చూస్తే, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం చూస్తోందని అన్నారు.
ఈనెలలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందించబోతున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. కార్డులు ఇచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని గర్వంగా చెబుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశి నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రీను, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, సింహా నాగమణి, సింహా వెంకటేష్, కొల్లి నాని, దాస్యం ప్రసాద్, ఆడారి లక్ష్మీ నారాయణ, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


