యువతకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి…ఎనమల్ల నవీన్ .
డిండి(గుండ్లపల్లి)ఆగస్టు 02 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని గోనకల్ గ్రామంలో అఖిల భారత యువజన సమాఖ్య జెండాను ఆవిష్కరించారు. సమావేశంలో అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ,రాజీవ్ యువ వికాసం పథకంలో నిరుద్యోగులు ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు రాజీవ్ యువ వికాసం లోన్లు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు లోన్లు కేటాయించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని వారన్నారు.
అనంతరం AIYF గోనకల్ గ్రామ నూతన కమిటీ అధ్యక్షులుగా నూనె భూపాల్,కార్యదర్శి కాంపల్లి శ్రీకాంత్,కోశాధికారి కర్ణాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో AIYF మండల కార్యదర్శి ఆర్కపల్లి మహేష్,సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి రాగం వెంకటేశ్వర్లు,సహాయ కార్యదర్శి కాంపల్లి లవన్, AISF డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్ కుమార్,కాంపల్లి ప్రవీణ్, అరవింద్,రాజు,శంకర్, మండారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


