MLA Vegulla : ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట: అర్హులందరికీ ఫించన్లు అందిచటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పేర్కొన్నారు. పట్టణంలోని 10, 11, 12, 18 వార్డులలో స్ధానిక నాయకులతో కలసి ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం సుపరిపాలన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పెరిగిన పెన్షన్లతో అవ్వాతాతలకు కష్టాలు దూరం అయ్యాయని చెప్పారు. ఇచ్చినమాట ప్రకారం ఏడాదిలోనే ప్రజలందరకీ సంక్షేమం ఇస్తున్నారని పేర్కొన్నారు. భర్త చనిపోయిన మహిళలకు స్పౌస్ పించన్లు అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, మల్లిపూడి గణేష్, వాదా ప్రసాదరావు, కొవ్వాడ అప్పన్నబాబు, శెట్టి రవి, సంకు మాధవి దేవి, సంకు యజ్ఞేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla distributed pensions

You cannot copy content of this page

Scroll to Top