సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలుపై పోస్ట్ కార్డు ఉద్యమం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,ఆగస్టు,01: ఏపీ బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం కాకినాడలో భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు సూరిబాబు అధ్యక్షతన స్థానిక శారదా దేవి గుడి భవన నిర్మాణ కార్మికులకుసంక్షేమ పథకాలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించడం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా ఏపీ బిల్డింగ్, మరియు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భవన నిర్మాణ కార్మికులకు, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ,,శ్రీ నారా చంద్రబాబు నాయుడు,కి, ఉప ముఖ్యమంత్రి గౌ,, శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్,కి పోస్ట్ కార్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల ఆవేదన, వారి సమస్యలను తెలియజేసేందుకు ఈ లెటర్లో రాయిస్తున్నామని, కార్మికుల స్వచ్ఛందంగా మా నిధులు మాకే ఖర్చు చేయాలని, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు చేయాలని లెటర్ లో రాస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్, వెంటనే అమలు చేయాలని, సంక్షేమ బోర్డు కు కోటి రూపాయలు ఇస్తానన్న హామీని తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన అన్నారు.
ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిర్మాణ కన్స్ట్రక్షన్ లో వసూలు చేస్తున్న 1 శాతం నిధులు ప్రభుత్వం దుర్వినియోగిస్తుందని, ఇప్పటికైనా మా నిధులు మాకే ఖర్చు చేయాలని, వాడుకున్న నిధులు తిరిగి సంక్షేమ బోర్డుకి జమ చేయాలని, యాక్సిడెంట్ క్లైమ్, సాధారణ మరణం, డెలివరీ, మ్యారేజ్ గిఫ్ట్, హాస్పిటల్లైజేషన్ తదితర క్లెయిమ్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి వృద్ధాప్య పెన్షన్ 5000 రూపాయలు మంజూరు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ప్రత్యేక రాయితీ కల్పించాలని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రజా ప్రతినిధులు గళం విప్పాలని నిర్మాణ కార్మికులను మోసగిస్తే పుట్టగతులు ఉండవని, నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కే. శ్రీను, కే .రాము, సురేంద్ర, భాను, ప్రకాష్, సాగర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


