Right to Information Act : సమాచార హక్కు చట్టం ప్రతి సామాన్య మానవుడు హక్కు

TRINETHRAM NEWS

సమాచార హక్కు చట్టం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చెయ్యాలి

కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన సమాచార చట్టం రక్షణ సమితి సభ్యులు

దేవరకొండజులై 28 త్రినేత్రం న్యూస్. సమాచార హక్కు చట్టం-2005 మానిటరింగ్ కమిటీ సభ్యులను ఏర్పాటు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అనంతరం సమాచార హక్కు చట్టం రక్షణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని అదేవిధంగా వారికి కమిటీ పట్ల దరఖాస్తు చేసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. అదే విధంగా సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పారదర్శక జవాబుదారీతనాన్ని పెంపొందించుటకు జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా సమాచార హక్కు చట్టం ప్రతి సామాన్య మానవుడు అందుబాటులో ఉంటుందని వారు అన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన బోర్డులను ఏర్పాటు చేసి సంబంధిత సమాచారానికై సంప్రదించాల్సిన చరవాణి నెంబర్లను కూడా అందులో పొందుపరచాలని ప్రతి రెండు నెలలకు ఒకసారి సమాచార హక్కు చట్టంపై సమీక్ష నిర్వహించి పటిష్టంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వల్ల సామాన్య ప్రజలకు సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉంచడంతో పాటు ప్రభుత్వ అధికారులను జవాబుదారీతనం పెరిగి పాలనలో పారదర్శక సాధ్యమవుతుందని తెలిపారు.
గ్రామస్థాయి సెక్రెటరీ నుండి రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం పై అవగాహన కల్పించి బాధ్యతాయుతంగా సమాచారం కోరితే సమాచారం ఇవ్వవలసిందిగా చట్ట ప్రకారం కోరిన వారికి తప్పక సమాచారం ఇచ్చే విధంగా అధికారులకు అవగాహన కల్పించాలని వారు కోరారు.వారితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, రాష్ట్ర కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి లు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Right to Information Act is

You cannot copy content of this page

Scroll to Top