అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ (హుకుంపేట) జులై 25 : వర్షాన్ని సైతం పక్కన పెట్టి జోరు వానలో ప్రజల మధ్యకి వచ్చారు తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర . “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని శుక్రవారం రంగశీల పంచాయతీ సిమిలీగూడ గ్రామంలో నిర్వహించారు.
ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అందించిన లబ్ధులు వివరించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా వచ్చిన ప్రజలు ఆయనకు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు. తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రోడ్ల అభివృద్ధిపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా, కొన్ని సాంకేతిక సమస్యలపై ఫిర్యాదులు కూడా చేశారు.
ప్రభుత్వ మళ్లీ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించే బాధ్యతను తన బృందం నిర్వహిస్తుందని దొన్ను దొర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ పెట్టెలి బాలు, పిసా అధ్యక్షుడు తమన్నా, వైస్ సర్పంచ్ పాంగి దాసుబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


