Lorry Overturns : లారీ బోల్తా : రాకపోకలకు అంతరాయం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన అశ్వారావుపేట – ఉట్లపల్లి సమీపంలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ రోడ్డుపై బోల్తా పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటనలో భాగంగా ముందు నుంచి గాని వెనుక నుంచి గాని వాహనాలు రాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.అందుబాటులో ఉన్న స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని, లారీని రోడ్డు సైడ్ కు తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lorry overturns: Traffic disruption

You cannot copy content of this page

Scroll to Top