MLA Venigandla Ramu : ఏడాది పాలనలో ఎన్నెన్నో విజయాలు

TRINETHRAM NEWS

తేదీ : 25/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పద్దెనిమిది వ వార్డులో సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలలో ఇబ్బందులు ఉన్నాయా మహిళలను అడిగి తెలుసుకున్నారు. పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఒక్క కుటుంబానికి అందించారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతుంటే చూసి ఓర్వలేక వైసిపి నేతలు పిచ్చివాగుడులు వాగుతున్నారని మండిపడ్డారు. పేద వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏడాది పాలనలో ఎన్నెన్నో విజయాలు సాధించామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చైర్మన్ యలవర్తి .శ్రీనివాసరావు, గుడివాడ టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు, సీనియర్ టిడిపి నాయకులు జి. సత్యనారాయణ, చేకూరు. జగన్మోహన్రావు, పి. సాంబశివరావు, జి. సునీల్, పి. ఉమా, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Many successes in one

You cannot copy content of this page

Scroll to Top